News November 3, 2024

అంబులెన్స్‌ దుర్వినియోగం.. కేంద్ర మంత్రిపై కేసు

image

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ అంబులెన్స్‌ను దుర్వినియోగం చేసినందుకు కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేర‌ళ పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు. గతంలో త్రిసూర్ BJP MP అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న సురేశ్ స్థానికంగా పూరం ఉత్స‌వానికి సొంత వాహనంలో కాకుండా అంబులెన్స్‌లో వెళ్లార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీన్ని అధికార‌, విప‌క్షాలు తీవ్రంగా ఖండించాయి. అంబులెన్స్ ఉపయోగించలేదని ఒకసారి, ఉపయోగించినట్లు మరోసారి గోపీ అంగీకరించారు.

Similar News

News December 8, 2024

మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదు చేయలేదు: పీఆర్ టీమ్

image

మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర <<14823100>>ఫిర్యాదులు<<>> చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మనోజ్ గాయాలతో వెళ్లి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ గొడవపడ్డారని, పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

News December 8, 2024

డాకు మహారాజ్‌కు మాస్ మహారాజా వాయిస్ ఓవర్?

image

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. బాలయ్య పాత్రను మాస్ మహారాజా పరిచయం చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారని టాలీవుడ్ టాక్. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News December 8, 2024

మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది: సీఎం రేవంత్

image

TG: ఏడాది పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని CM రేవంత్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్, 55,000 జాబ్స్ అందించామని, 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని ట్వీట్ చేశారు. తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.