News August 13, 2025
విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డి

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో కోర్టు విచారణ ప్రారంభించింది. కాగా గత నెల 20 నుంచి మిథున్ రాజమండ్రి జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News August 14, 2025
పుతిన్‌కు ట్రంప్ హెచ్చరికలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 15న అలస్కా వేదికగా జరగనున్న సమావేశం తర్వాత ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా రాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ భేటీ ఊహించిన విధంగా కొనసాగితే.. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో కలిసి మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.
News August 14, 2025
థియేటర్లలో మారణహోమం జరుగుతుంది: NTR

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్2’ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ మూవీపై అంచనాలు పెంచేశారు. ‘ఇది యుద్ధం. ఇవాళ థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్2 మూవీపై గర్వంగా ఉన్నాను. దీనిపై మీ రియాక్షన్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ అంతా ‘కొడుతున్నాం అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
News August 14, 2025
మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

TG: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI-2025’ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే తనకు ఈ గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.