News May 26, 2024
రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

TG: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేపు జరగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్లు ఓటేయనున్నారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫున రాకేశ్ రెడ్డి, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Similar News
News February 15, 2025
బర్డ్ ఫ్లూ.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

AP: బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలుంటే ఉ.6 నుంచి రా.9 గంటల మధ్య 0866 2472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
News February 15, 2025
లోన్ కట్టలేదని గేటు ఊడదీసుకుపోవడం ఏంటి?: తుమ్మల

TG: లోన్ చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటి గేటు తీసుకెళ్లిన <<15446915>>ఘటనపై<<>> వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు. అప్పులు చెల్లించని డిఫాల్టర్లకు బ్యాంకులు రూ.కోట్లతో రుణాలు ఇస్తున్నాయని, రైతులు సకాలంలో లోన్ కట్టకపోతే గేటు ఊడదీసుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. మానవీయ కోణంలో వ్యవహరించాలని నాబార్డు రుణ ప్రణాళిక సదస్సులో ఆయన సూచించారు. అన్నదాతలకు రుణాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం తగదన్నారు.
News February 15, 2025
జయలలిత బంగారు ‘ఖజానా’!

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.