News August 8, 2024

ఎమ్మెల్సీ బై ఎలక్షన్.. వైసీపీ క్యాంపు రాజకీయం?

image

AP: విశాఖ స్థానిక సంస్థల <<13788692>>ఎమ్మెల్సీ<<>> ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వైఎస్ జగన్ నేరుగా MPTC, ZPTCలతో మాట్లాడుతున్నారు. నిన్న అరకు, పాడేరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఇవాళ పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి నేతలతో భేటీ అనంతరం వారిని కూడా క్యాంపునకు తరలిస్తారని తెలుస్తోంది.

Similar News

News December 11, 2025

రోజ్మేరీ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

image

రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్​ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి

News December 11, 2025

550 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కపుర్తాలాలోని <>రైల్<<>> కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PWD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://rcf.indianrailways.gov.in

News December 11, 2025

రేగు పండ్లు తింటే ఎన్ని లాభాలో..

image

చలికాలంలో లభించే రేగు పండ్లను తరచూ తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడతాయని వెల్లడిస్తున్నారు. కడుపులో మంట, మలబద్దకం సమస్యలు, చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయంటున్నారు. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ పండ్లు క్యాన్సర్ కారకాలనూ నిరోధిస్తాయంటున్నారు. మీకు రేగు పండ్లు ఇష్టమా? కామెంట్ చేయండి.