News March 4, 2025
MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Similar News
News December 10, 2025
వికారాబాద్: జిల్లాలో 17 మంది సస్పెండ్

పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 17 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
News December 10, 2025
ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.
News December 10, 2025
అఖండ-2 టికెట్ రేట్లు భారీగా పెంపు

అఖండ-2 సినిమా టికెట్ల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా రేపు రా.8 గంటల ప్రీమియర్ షో టికెట్ రేట్ను రూ.600గా నిర్ధారించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున టికెట్ రేట్ పెంచుకోవచ్చని పేర్కొంది. కాగా అఖండ-2 టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం <<18519580>>ఇప్పటికే<<>> అనుమతి ఇచ్చింది.


