News May 25, 2024

ముగిసిన MLC ఎన్నికల ప్రచారం

image

TG: ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న ఈ మూడు జిల్లాల్లోని పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న ఫలితం వెలువడుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

Similar News

News February 14, 2026

సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

image

T20WC: అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 175-7 స్కోర్ చేసింది. చాప్‌మన్ 48, మిచెల్ 32, అలెన్ 31 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్ జాన్సెన్ 4 వికెట్లు తీసి సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కి చేరువ కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు 2 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్‌-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

News February 14, 2026

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి: CM రేవంత్

image

TG: మున్సిపల్ ఫలితాలపై మంత్రులతో CM రేవంత్ భేటీ ముగిసింది. కాంగ్రెస్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏ ఎన్నికైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు.

News February 14, 2026

‘శివ లింగం’ అంటే ఏంటంటే?

image

పరమశివుని ఆరాధనలో ‘శివలింగం’ అత్యంత ముఖ్యమైనది. శాస్త్రాల ప్రకారం శివలింగం అంటే భగవంతుని ఒక రూపం లేదా ప్రతీక అని అర్థం. కంటికి కనిపించని ఆ పరమేశ్వరుడిని భక్తితో ఒక శిలా లేదా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, స్థితి, లయకారుడైన ఆ దేవుని అనుగ్రహం పొందేందుకు ‘శివలింగారాధన’ ఒక గొప్ప మార్గం. ఈ ఆరాధన ద్వారా భక్తులు మానసిక ప్రశాంతతను, శివుడి అనుగ్రహాన్ని పొందుతారని పురోహితులు చెబుతున్నారు.