News May 25, 2024
ముగిసిన MLC ఎన్నికల ప్రచారం

TG: ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27న ఈ మూడు జిల్లాల్లోని పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న ఫలితం వెలువడుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
Similar News
News February 18, 2025
ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం: మంత్రి డీబీవీ స్వామి

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవసరం అయితే కొత్త నియామకాలు చేపడతామని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన A, B, C క్యాటగిరీలుగా వారిని నియమించాలని నిర్ణయించామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
News February 18, 2025
మంచినీళ్లు వృథా చేస్తే రూ.5000 ఫైన్

బెంగళూరు పౌరుల నీటి వాడకంపై KA ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాగునీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్ విధించనుంది. కార్ల వాషింగ్, గార్డెనింగ్, ఫౌంటేన్లు, మాల్స్, సినిమా హాళ్లలో మంచినీరు వాడొద్దని సూచించింది. ఉల్లంఘిస్తే రూ.5000, రూల్స్ పాటించేంత వరకు రోజుకు రూ.500 అదనంగా వసూలు చేస్తామంది. MON నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలోని 14000 బోర్లలో సగం ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడింది.
News February 18, 2025
విడదల రజినీకి హైకోర్టులో ఊరట

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.