News February 19, 2025

MLC ఎన్నికలు.. పదేపదే కాల్స్‌తో తలనొప్పి!

image

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి-గుంటూరు, కృష్ణా, తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మద్దతు అడుగుతున్నారని.. రోజుకు 10 కాల్స్ వస్తే 7-8 కాల్స్ వాళ్లవే అని అసహనానికి గురవుతున్నారు. మరి మీకూ కాల్స్ వస్తున్నాయా?

Similar News

News March 24, 2025

లక్ష్యంపై గురి తప్పకూడదంటే ఇవి తప్పనిసరి

image

ఎన్ని అడ్డంకులున్నా అర్జునుడికి తాను గురిపెట్టిన పక్షి కన్నే కనిపించేదట. సాధకుడికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా గమ్యంపై గురి తప్పకూడదు. అలా ఉండేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులు కొన్ని మార్గాల్ని సూచిస్తున్నారు. అవి.. పని ఎప్పుడు ఎలా చేయాలన్న ప్రణాళిక ముందుగానే రచించుకోవాలి. పనుల్ని వాయిదా వేయకూడదు. ఒకేసారి అన్నీ చేసేద్దామనుకోకూడదు. ఒత్తిడికి లోనుకాకుండా అప్పుడప్పుడూ స్వల్ప విరామం తీసుకోవాలి.

News March 24, 2025

ప్యాసింజర్ల హక్కులపై ఎయిర్‌లైన్స్‌కు DGCA కఠిన ఆదేశాలు

image

ప్యాసింజర్ల హక్కులను తెలియజేస్తూ ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎయిర్‌లైన్స్‌కు DGCA సూచించింది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ‌లో అందుబాటులో ఉన్న ప్యాసింజర్ ఛార్టర్‌ను టికెట్ బుక్ చేసుకున్న వారికి వాట్సాప్/SMS ద్వారా పంపించాలని ఆదేశించింది. అలాగే ఈ సమాచారాన్ని టికెట్ల పైన, వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని తెలిపింది. దీంతో లేటైన ఫ్లయిట్లు, పోగొట్టుకున్న లగేజీకి పరిహారం పొందడం వంటివి ప్రయాణికులకు తెలుస్తాయి.

News March 24, 2025

జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్

image

TG: వచ్చే నెలలో సీఎం రేవంత్‌ రెడ్డి వారం రోజుల పాటు జపాన్‌‌లో పర్యటించనున్నారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కలిసి కోరనున్నారు.
రేవంత్‌తో పాటు జపాన్‌కు శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లనున్నారు.

error: Content is protected !!