News August 28, 2024

నేడు రాష్ట్రానికి ఎమ్మెల్సీ కవిత

image

TG: ఢిల్లీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత నేడు రాష్ట్రానికి రానున్నారు. 5 నెలలకు పైగా జైలు జీవితం తర్వాత ఆమె హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతారని సమాచారం. కాగా మార్చి 15న ED అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 18, 2026

గర్భిణులు పారాసిటామాల్ వాడొచ్చు!

image

గర్భిణులు పారాసిటామాల్ ట్యాబ్లెట్ వాడొచ్చని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. దీని వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం రాదని, మెదడు ఎదుగుదలపై ఎఫెక్ట్ ఉండదని పేర్కొంది. స్వీడన్, జపాన్‌కు చెందిన 26లక్షల మంది పిల్లల డేటాను విశ్లేషించిన సైంటిస్టులు పారాసిటామాల్ వాడకంపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఈ ట్యాబ్లెట్ వల్ల పిల్లలకు ముప్పు అని SMలో ప్రచారం జరిగింది. అటు గర్భిణులకు ఉన్న అనుమానాలనూ ఈ నివేదిక తొలగించింది.

News January 18, 2026

చంద్ర దోష నివారణకు నేడు సువర్ణవకాశం..

image

అమావాస్య నాడు చంద్రకళలు క్షీణించి ఉంటాయి. అందుకే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారికి మానసిక అశాంతి కలుగుతుంది. దీని నివారణకు చొల్లంగి అమావాస్య సరైన రోజని జ్యోతిషులు చెబుతున్నారు. ‘తెల్లని వస్త్రంలో బియ్యం, చిన్న వెండి చంద్రుని ప్రతిమను పెట్టి, తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సాయంత్రం వేళ ప్రవహించే నదీ జలాల్లో ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని, తెల్లని పూలను విడిచిపెట్టాలి’ అని సూచిస్తున్నారు.

News January 18, 2026

NASA ఆఫర్.. మూడ్రోజులే ఛాన్స్

image

చంద్రుడిని చుట్టి వచ్చేందుకు NASA <<18861755>>ఆర్టెమిస్-2<<>> టెస్ట్ ఫ్లైట్ మిషన్ చేపట్టింది. ఇందులో ప్రజలను భాగం చేసేందుకు ‘సెండ్ యువర్ నేమ్’ క్యాంపైన్ రన్ చేస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను SD కార్డ్‌లో వేసి ఆస్ట్రోనాట్స్‌తో పాటు పంపుతారు. 10 రోజులపాటు మీ పేరు చంద్రుడిని చుట్టొస్తుంది. వారి పేరుతో బోర్డింగ్ పాస్ కూడా ఇస్తున్నారు. JAN 21తో ఈ క్యాంపైన్ ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు <>క్లిక్<<>> చేయండి.