News February 1, 2025

MNCL: అభయారణ్యం నుంచి వెళ్లే వాహనాలకు FEES

image

చెన్నూరు డివిజన్ ప్రాణహిత కృష్ణ జింకల వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ రుసుం వసూలుకు ప్రతిపాదించినట్లు జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. వెంచపల్లి రక్షిత అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నంబర్ 329, కోటపల్లిలోని పారుపల్లి, చెన్నూర్‌లోని కిష్టంపేట బీట్ వై జంక్షన్ వద్ద 2 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు.

Similar News

News February 1, 2025

రేవంత్.. దమ్ముంటే HYD పేరు మార్చండి: బండి సంజయ్

image

TG: BJP ఆఫీసున్న వీధి పేరును గద్దర్ పేరిట మారుస్తానని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘పద్మ అవార్డు ఇవ్వనందుకు ఓ వీధి పేరు మారుస్తానని CM అనడం చూస్తుంటే నవ్వొస్తోంది. గద్దర్‌పై కేసులు పెట్టింది, అవమానించింది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్‌కు దమ్ముంటే ముందుగా HYD పేరును భాగ్యనగర్‌గా, NZB పేరును ఇందూరుగా, MBNR పేరును పాలమూరుగా మార్చాలి’ అని X వేదికగా సవాల్ విసిరారు.

News February 1, 2025

మద్దిలపాలెంలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్‌ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైడ్‌లో వ్యభిచార గృహం నడిపిస్తున్న సంతోశ్ కుమార్‌‌, విటుడు పెందుర్తికి చెందిన కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News February 1, 2025

అనంత జిల్లాకు 14 మద్యం దుకాణాల కేటాయింపు

image

అనంతపురం జిల్లాలో గీత కులాలకు 14 మద్యం దుకాణాలను కేటాయించినట్లు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈడిగలకు 9, కాలాలి 1, గౌడు 2, గౌడ 1, గౌన్లకు 1 కేటాయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 17న రెవెన్యూ భవన్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తామన్నారు.