News February 1, 2025
రేవంత్.. దమ్ముంటే HYD పేరు మార్చండి: బండి సంజయ్

TG: BJP ఆఫీసున్న వీధి పేరును గద్దర్ పేరిట మారుస్తానని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘పద్మ అవార్డు ఇవ్వనందుకు ఓ వీధి పేరు మారుస్తానని CM అనడం చూస్తుంటే నవ్వొస్తోంది. గద్దర్‌పై కేసులు పెట్టింది, అవమానించింది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్‌కు దమ్ముంటే ముందుగా HYD పేరును భాగ్యనగర్‌గా, NZB పేరును ఇందూరుగా, MBNR పేరును పాలమూరుగా మార్చాలి’ అని X వేదికగా సవాల్ విసిరారు.
Similar News
News February 15, 2025
అమ్మడు లైనప్ అదిరిందిగా!

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ బ్యూటీ నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. రామ్ పోతినేని సరసన RAPO22, దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో ఆమె కనిపిస్తారని సమాచారం. దీంతో ఈ అమ్మడి లైనప్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News February 15, 2025
బీసీల కోసం మోదీ ఏమీ చేయలేదు: మహేశ్ గౌడ్

TG: బీసీల కోసం మోదీ ఏమీ చేయలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. బీసీ వ్యక్తి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే తొలగించారని చెప్పారు. బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై నానా హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. ఓబీసీ అంటూ ప్రచారం చేసుకున్నారే తప్ప వాళ్లకేమీ చేయలేదని విమర్శించారు.
News February 15, 2025
మంత్రి లోకేశ్‌ను కలిసిన విద్యార్థులు

AP: మంత్రి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో వెటర్నరీ విద్యార్థులు కలిశారు. తమ స్టైఫండ్ పెంచాలని మంత్రిని వారు కోరారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.