News April 13, 2025

MNCL: పాప ప్రాణం తీసిన పాము

image

లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్ పేట‌లో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ముక్కుపచ్చలారని చిన్నారి కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జాడి సుధాకర్ నాలుగేళ్ల కుమార్తె ఉదయశ్రీ శనివారం సాయంత్రం పాముకాటుతో మృతి చెందింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పాము కాటు వేయడంతో వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా మృతి చెందింది.

Similar News

News April 15, 2025

డబ్బు కాదు విధేయత ముఖ్యం.. అందుకే KKRను వీడలేదు: రమణ్‌దీప్

image

KKR తనను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోవడం వెనుక ఉన్న కథను రమణ్‌దీప్ వెల్లడించారు. వేలానికి ముందు రిటైన్‌కు ఒప్పుకోవద్దని, రూ.9-10 కోట్లతో కొనుగోలు చేస్తామని చాలా టీమ్స్ ఆఫర్ ఇచ్చాయన్నారు. అయితే తనకు తొలుత అవకాశం ఇచ్చిన KKRపై విధేయత ఉందని చెప్పారు. అందుకే డబ్బు తక్కువైనా టీమ్‌లోనే ఉంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. వేలంలోకి వెళితే ఇదే జట్టులోకి వస్తాననే గ్యారంటీ లేదన్నారు.

News April 15, 2025

ICC POTM అవార్డులు.. ఎవరికెన్నంటే?

image

శ్రేయస్ అయ్యర్ ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ ‌అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ అవార్డును 8 మంది భారత క్రికెటర్లు సాధించారు. శుభ్‌మన్ గిల్ 3, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రెండేసి సార్లు ఎంపికవ్వగా, పంత్, అశ్విన్, భువనేశ్వర్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్ ఒక్కోసారి ఎంపికయ్యారు.

News April 15, 2025

సీఎల్పీ భేటీ ప్రారంభం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సీఎల్పీ మీటింగ్ ప్రారంభం అయింది. డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై చర్చిస్తున్నారు. భూభారతి, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలకు అవగాహన కల్పించడంపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌కు వివేక్, రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్ గైర్హాజరయ్యారు.

error: Content is protected !!