News November 12, 2024
చినాబ్ రైల్వే బ్రిడ్జిపై మాక్ డ్రిల్

J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమర్జెన్సీ, మెడికల్ బృందాలు డ్రిల్లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
Similar News
News November 2, 2025
చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే..?

శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నీటితో అభిషేకం చేసినా ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే చెరకు రసంతో శివుడిని అభిషేకం చేయడం మరింత పుణ్యమని అంటున్నారు. ‘చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి, ధనవృద్ధి కలుగుతుంది. ఈ అభిషేకం ద్వారా చెరుకు లాగే భక్తుల జీవితం కూడా మధురంగా మారుతుందని నమ్మకం. అప్పుల బాధలు తొలగి, ధనానికి లోటు లేకుండా జీవించడానికి ఈ అభిషేకం చేయాలి’ అంటున్నారు.
News November 2, 2025
అడుగులోనే అరక విరిగిందట

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.
News November 2, 2025
నేడే మూడో T20.. సమం చేస్తారా?

నేడు ఓవల్ వేదికగా IND, AUS మధ్య మూడో టీ20 జరగనుంది. రెండో T20లో ఘోర వైఫల్యం తర్వాత టీమ్ఇండియా కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూర్య(C), గిల్ గాడిలో పడాలి. తిలక్ వర్మ, దూబే, శాంసన్ల నుంచి భారీ స్కోర్ బాకీ ఉంది. AUS బౌలర్ హేజిల్వుడ్ లేకపోవడం కలిసొచ్చే అంశం. అర్ష్దీప్ ఉంటారా.. లేదా? అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. మ.1.45 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు.


