News November 12, 2024

చినాబ్ రైల్వే బ్రిడ్జిపై మాక్ డ్రిల్

image

J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమ‌ర్జెన్సీ, మెడిక‌ల్ బృందాలు డ్రిల్‌లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Similar News

News December 7, 2024

3వ క్వార్టర్‌లో పుంజుకుంటాం: FM నిర్మల

image

సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు క్షీణించ‌డం వ్యవస్థాగత మందగమనాన్ని సూచించవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు. 3వ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని రాబోయే రోజుల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజా, మూలధన వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల 2వ త్రైమాసికంలో అభివృద్ధి మందగించింద‌న్నారు.

News December 7, 2024

మ్యూజిక్ నుంచి రెహమాన్ బ్రేక్? కూతురు ఏమన్నారంటే?

image

ఏఆర్ రెహమాన్ ఏడాదిపాటు మ్యూజిక్ వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కూతురు ఖతీజా ఖండించారు. ఇలాంటి పనికిరాని రూమర్స్‌ను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ఇటీవల రెహమాన్, తన భార్య సైరా భాను విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు.

News December 7, 2024

అల్పపీడనం.. రేపు వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.