News May 6, 2024

మోదీ భరోసా.. ఏపీకి మంచి రోజులే: CBN

image

AP అభివృద్ధికి ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని అనకాపల్లి సభలో చంద్రబాబు వెల్లడించారు. ‘రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో మోదీ, అమిత్ షా చెప్పారు. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయం. అధికారం ఉందని జగన్ విర్రవీగారు. 25 లోక్‌సభ, 160 ఎమ్మెల్యే సీట్లలో కూటమిదే విజయం’ అని CBN విశ్వాసం వ్యక్తం చేశారు.

Similar News

News December 29, 2024

కొత్త ఆఫర్: రూ.277తో రీఛార్జ్ చేస్తే..

image

న్యూ ఇయర్ సందర్భంగా BSNL కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.277తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 120GB హై-స్పీడ్ డేటా వస్తుంది. రోజుకు గరిష్ఠంగా 2GB వాడుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. అయితే సిగ్నల్ సరిగా రావట్లేదని, నెట్ చాలా స్లో ఉంటోందని కస్టమర్లు BSNLపై ఫిర్యాదులు చేస్తున్నారు.

News December 29, 2024

ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులే: మంత్రి

image

AP: పేర్ని నాని ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతానికి ఎందుకు వెళ్లారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా 7 వేల రేషన్ బియ్యం బస్తాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశామని, లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులేనని, సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనేనని విమర్శించారు. సానుభూతి కోసం భార్య పేరును వాడుకుంటున్నారని ఫైరయ్యారు.

News December 29, 2024

ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు: డీజీపీ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 9.87% కేసులు పెరిగాయన్నారు. ఈ ఏడాది 1,942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును ఆయన వెల్లడించారు. రూ.142.50 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఒకటి, రెండు ఘటనలు మినహా శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.