News August 27, 2024

పొద్దున బైడెన్.. మధ్యాహ్నం పుతిన్‌కు మోదీ ఫోన్

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడానని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించానని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత వైఖరి, ఉక్రెయిన్‌లో తాజా పర్యటన గురించి వివరించానన్నారు. వివాదం త్వరగా సమసిపోయేందుకు, శాంతికి భారత్ కట్టుబడినట్టు చెప్పానన్నారు. కాగా US అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ మోదీ చర్చించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 4, 2025

రాజన్న సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గరిమ అగ్రవాల్, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కుమార్‌తో కలిసి గురువారం హాజరయ్యారు.

News December 4, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్‌లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.

News December 4, 2025

మలబద్ధకాన్ని నివారించాలంటే?

image

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్‌లో ఉండొద్దు.
* ఫుడ్‌లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.