News August 27, 2024
పొద్దున బైడెన్.. మధ్యాహ్నం పుతిన్‌కు మోదీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడానని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించానని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత వైఖరి, ఉక్రెయిన్‌లో తాజా పర్యటన గురించి వివరించానన్నారు. వివాదం త్వరగా సమసిపోయేందుకు, శాంతికి భారత్ కట్టుబడినట్టు చెప్పానన్నారు. కాగా US అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ మోదీ చర్చించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 8, 2024
ఏలియన్స్‌పై అమెరికా అధ్యయనం: మాజీ అధికారి
అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.
News September 8, 2024
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేశ్ బాబు?
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తారక్, మహేశ్‌ను ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలుగుతుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 10న దేవర ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
News September 8, 2024
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
APలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి CM చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్‌కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.