News February 9, 2025
దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రమాదకరం: రేవంత్

TG: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు ఇంత వివక్ష అని కేరళలోని ఓ సభలో ప్రశ్నించారు. ఈ రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రమాదకరమని, దక్షిణాది ప్రజలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఒకే వ్యక్తి-ఒకే పార్టీ అనేది మోదీ రహస్య విధానమన్నారు.
Similar News
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.
News November 23, 2025
పిల్లలు బరువు తగ్గుతున్నారా?

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.


