News February 9, 2025

దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రమాదకరం: రేవంత్

image

TG: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు ఇంత వివక్ష అని కేరళలోని ఓ సభలో ప్రశ్నించారు. ఈ రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రమాదకరమని, దక్షిణాది ప్రజలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఒకే వ్య‌క్తి-ఒకే పార్టీ అనేది మోదీ రహస్య విధాన‌మ‌న్నారు.

Similar News

News March 18, 2025

మైనార్టీలపై వేధింపుల ఆరోపణలు.. ఖండించిన యూనస్ ప్రభుత్వం

image

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలను యూనస్ ప్రభుత్వం ఖండించింది. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. తమ దేశానికి అపవాదు తెచ్చేలా ఆమె మాట్లాడారని మండిపడింది. భారత్ పర్యటనలో ఉన్న తులసి బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆమె కలిశారు.

News March 18, 2025

ఆ విషయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: గోదావరి నుంచి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్‌లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు.

News March 18, 2025

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

image

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.

error: Content is protected !!