News July 4, 2024
పార్లమెంట్‌ను అబద్ధాల కార్ఖానాగా మోదీ నడుపుతున్నారు: షర్మిల
ప్రధాని మోదీ నీచ రాజకీయాలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రలను దేశం గమనిస్తోందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ‘పార్లమెంట్‌ను అబద్ధాల కార్ఖానాగా మోదీ నడుపుతున్నారు. అద్భుత వాగ్ధాటి, దేశం, ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన కలిగిన రాహుల్ గాంధీని అవమానించేందుకు ఆయన దిష్టి బొమ్మలను కాల్పించే నీచ సంస్కృతితో మీరు ఏమి సాధిస్తారు? ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని మర్చిపోతున్నారు’ అని Xలో ఫైరయ్యారు.
Similar News
News October 7, 2024
ఆ కుర్చీలో కూర్చుంటే మరణశాసనం రాసుకున్నట్టేనా!
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆయన వారసత్వాన్ని స్వీకరించడానికి కీలక నేతలు జంకుతున్నారు. ఆ కుర్చీలో కూర్చోవడమంటే మరణశాసనాన్ని రాసుకున్నట్టే అనే భావనలో ఉన్నారు. ఈ కారణంతో ఇరాన్ మద్దతుగల ఈ సంస్థ పగ్గాలు చేపట్టడానికి కీలక నేత ఇబ్రహీం అమీన్ నిరాకరించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ బాధ్యతలు ప్రమాదకరమని హెజ్బొల్లా నేతలకు అవగతమైనట్టు తెలుస్తోంది.
News October 7, 2024
టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మొత్తం 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్: https://ssc.nic.in/
News October 7, 2024
Work From Home పని వేళలపై చట్టాల్లో అస్పష్టత: CM పినరయి
ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలు వర్క్‌ఫ్రం హోం విధానాల్లో ‘పని వేళల్ని’ స్పష్టంగా నిర్దేశించలేకపోతున్నాయని CM పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన EY సంస్థ ఉద్యోగిని మృతిపై ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. IT పార్కుల్లో లీజుకు ఉండే కంపెనీలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే ఉద్యోగులు న్యాయపరంగా ఎదుర్కోవచ్చన్నారు. ఉద్యోగుల ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.