News June 12, 2024
‘మోదీ కా పరివార్’ నాకు శక్తినిచ్చింది: మోదీ

ఎన్నికల సమయంలో తనపై అభిమానంతో సోషల్ మీడియాలో ప్రజలు తమ పేర్ల చివర ‘మోదీ కా పరివార్’ అని చేర్చడం తనకు శక్తినిచ్చిందని మోదీ అన్నారు. ఎన్డీఏకు మూడోసారి విజయం కట్టబెట్టి, దేశాభివృద్ధికి పాటుపడాలని అధికారం అప్పగించారని ట్వీట్ చేశారు. మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని చాటినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మోదీ తన X ఖాతా ప్రొఫైల్ పిక్, కవర్ ఇమేజ్ని మార్చారు.
Similar News
News November 20, 2025
₹600Crతో TG పోలీసు AMBIS అప్గ్రేడ్

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.
News November 20, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.
News November 20, 2025
చలికాలం స్నానం చేయడం లేదా?

చలి విపరీతంగా పెరగడంతో చాలామంది స్నానం చేసేందుకు ఇష్టపడరు. ఎంత వేడినీటితో షవర్ చేసినా తర్వాత చలివేస్తుందంటూ స్నానానికి దూరంగా ఉంటున్నారు. కొందరైతే రోజుల తరబడి స్నానం చేయడంలేదు. అయితే ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు. స్నానం చేయకపోతే శరీరంపై చెమట పేరుకుపోయి అలర్జీలకు దారి తీస్తుందట. అలాగే చర్మం నుంచి దుర్వాసన వచ్చి ఇతరుల దృష్టిలో చులకన అవుతారు. నిత్యం తప్పనిసరిగా స్నానం చేయాలి.


