News June 12, 2024

‘మోదీ కా పరివార్’ నాకు శక్తినిచ్చింది: మోదీ

image

ఎన్నికల సమయంలో తనపై అభిమానంతో సోషల్ మీడియాలో ప్రజలు తమ పేర్ల చివర ‘మోదీ కా పరివార్’ అని చేర్చడం తనకు శక్తినిచ్చిందని మోదీ అన్నారు. ఎన్డీఏకు మూడోసారి విజయం కట్టబెట్టి, దేశాభివృద్ధికి పాటుపడాలని అధికారం అప్పగించారని ట్వీట్ చేశారు. మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని చాటినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మోదీ తన X ఖాతా ప్రొఫైల్ పిక్, కవర్ ఇమేజ్‌ని మార్చారు.

Similar News

News March 15, 2025

‘ఫోటో ఓటర్ జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలి’

image

పారదర్శక, స్వచ్ఛమైన ఫోటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా నిరంతర మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికిసహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరూ జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్నమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు.

News March 15, 2025

ఇవాళ అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.

News March 15, 2025

జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

image

AP: వైసీపీ రాక్ష‌స మూక‌ల దాడిలో మృతిచెందిన‌ చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయ‌ప‌డిన రామ‌కృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హ‌త్యా రాజ‌కీయాలు మాన‌డం లేదని మండిపడ్డారు. YCP ర‌క్త‌చ‌రిత్ర‌కు TDP సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాకరమన్నారు.

error: Content is protected !!