News April 4, 2025
శ్రీలంకలో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ థాయ్లాండ్ పర్యటన ముగించుకుని శ్రీలంకకు చేరుకున్నారు. ఆయనకు కొలంబో ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ ద్వీప దేశ అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే బాధ్యతలు స్వీకరించాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. 3 రోజుల విజిట్లో రక్షణ, ఇంధన, హెల్త్, వాణిజ్య రంగాలపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
Similar News
News April 12, 2025
IPL: టాస్ గెలిచిన LSG

IPLలో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కుమార్తె అనారోగ్యం కారణంగా మిచెల్ మార్ష్ ఈ మ్యాచుకు అందుబాటులో లేరు. LSG: మార్క్రమ్, పూరన్, పంత్(C), హిమ్మత్ సింగ్, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్. GT: సుదర్శన్, గిల్(C), బట్లర్, రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, టివాటియా, అర్షద్, రషీద్, సాయికిశోర్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
News April 12, 2025
గ్రూప్-1 ఫలితాలపై ఆరోపణలు.. BRS నేతకు TGPSC నోటీసులు

TG: గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని <<15989891>>ఆరోపించిన<<>> బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఎటువంటి ఆరోపణలు చేయవద్దని సూచించింది.
News April 12, 2025
ప్రముఖ కథక్ కళాకారిణి మృతి

ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని లఖియా(95) మరణించారు. ఇవాళ ఉదయం ఆమె నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుజరాత్లోని అహ్మాదాబాద్లో 1930లో కుముదిని జన్మించారు. కడంబ్ సెంటర్ ఫర్ డాన్స్ను స్థాపించారు. కేంద్రం ఆమె సేవలను గుర్తించి ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.