News September 15, 2024

ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. టాటానగర్-పట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోగఢ్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మార్గాల్లో ప్రయాణించే రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఝార్ఖండ్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

Similar News

News October 4, 2024

లడ్డూ వివాదంపై సుప్రీంలో నేడు విచారణ

image

తిరుమల లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలా? లేదా స్వతంత్ర సంస్థలకు అప్పగించాలా? అనేది నేడు న్యాయమూర్తులు తేల్చనున్నారు.

News October 4, 2024

అమరావతి మీదుగా NH-16 విస్తరణ: పెమ్మసాని

image

AP: కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే NH-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. వినుకొండ-గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25KM పొడిగించారన్నారు. ఇది రాజధాని అమరావతిని తాకేలా రూపొందిందని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ పనులు చేపడుతుందని తెలిపారు.

News October 4, 2024

మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్

image

దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్‌ను కలిగి ఉన్నాయి.