News November 6, 2024

ముగ్గురు US ప్రెసిడెంట్లతో మోదీ సావాసం

image

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక లాంఛనమైపోవడంతో ఆయనకు భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 నుంచి ముగ్గురు అధ్యక్షులు మారినా మోదీ మాత్రం భారత ప్రధానిగానే ఉన్నారని గుర్తుచేస్తున్నారు. 2014-17 వరకు ఒబామా, 2017-21 వరకు ట్రంప్, 2021- 24 వరకు బైడెన్, మళ్లీ ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలుగా మోదీ వీరితో సావాసం చేస్తున్నారు.

Similar News

News January 20, 2026

పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.

News January 20, 2026

జపాన్ వినూత్న పద్ధతి.. రైతును గౌరవించేలా!

image

జపాన్‌లో కూరగాయలు, పండ్ల ప్యాకెట్లపై వాటిని పండించిన రైతు ఫొటోను ముద్రిస్తారు. దీనిని ‘కావో నో మియెరు యసాయి’ అంటారు. 1970లో ప్రారంభమైన ఈ విధానం వల్ల తాము తినే ఆహారం ఎవరి కష్టం ద్వారా వచ్చిందో వినియోగదారులకు తెలుస్తుంది. ఇది రైతు శ్రమకు గుర్తింపునివ్వడమే కాకుండా కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. దీని వల్ల రైతుకు, కొనే వ్యక్తికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇలాంటి విధానం మన దగ్గరా ఉండాలా? COMMENT

News January 20, 2026

ఫ్రెంచ్ వైన్‌పై 200% టారిఫ్‌లు వేస్తా.. మాక్రాన్‌పై ట్రంప్ ఫైర్

image

గాజా శాంతి కోసం ప్రతిపాదించిన ‘Board of Peace’లో చేరడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సుముఖంగా లేరన్న వార్తలపై ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ‘ఆయన ఎలాగూ త్వరలో పదవి నుంచి తప్పుకొంటున్నారు. ఆయన అవసరం ఎవరికీ లేదు. కానీ పీస్ బోర్డులో చేరకపోతే ఫ్రెంచ్ వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్ వేస్తా. అప్పుడు ఆయనే దారిలోకి వస్తారు’ అంటూ బెదిరించారు. ట్రంప్ టారిఫ్‌ల అస్త్రం వాడటం పరిపాటిగా మారింది.