News September 29, 2024

తెలంగాణపై మోదీ ప్రశంసలు

image

తెలంగాణ ప్రజలపై 114వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారని చెప్పారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయన్నారు. మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారని వెల్లడించారు. జూన్ నుంచి ఇప్పటివరకు 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామన్నారు. దీంతో తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోందన్నారు.

Similar News

News October 7, 2024

BIG ALERT: మళ్లీ తుఫాన్లు.. భారీ వర్షాలు

image

AP: ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. ఇవాళ మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

News October 7, 2024

ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’

image

TG: బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. పూర్వం బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం తగిలి అపవిత్రం జరిగిందని ప్రచారంలో ఉంది. దీంతో ఇవాళ బతుకమ్మను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా సమర్పించరు. అలక వీడాలని అమ్మవారిని మహిళలు ప్రార్థిస్తారు. అటు ఈరోజు దుర్గామాత శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

News October 7, 2024

మంత్రి సురేఖను తప్పిస్తారంటూ ప్రచారం.. పీసీసీ చీఫ్ ఏమన్నారంటే?

image

TG: సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని PCC చీఫ్ మహేశ్ కుమార్ ఖండించారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసిందని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.