News February 26, 2025

మహిళలకు మోదీ సోషల్ మీడియా అకౌంట్స్!

image

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్. ఆయనకు సోషల్ మీడియాలోనూ కోట్లాది మంది ఫాలోవర్లున్నారు. ఇన్‌స్టాలో 92.3 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 50 మిలియన్లు, Xలో 105.5 మిలియన్ల ఫాలోవర్లు ఆయన సొంతం. అలాంటి అకౌంట్స్ ఒక్కరోజు మీ సొంతమైతే ఏం చేస్తారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కొంతమంది స్ఫూర్తిదాయకమైన మహిళలకు ఈ ఖాతాలు అందించనున్నారు. వారి అనుభవాలను ఇందులో పంచుకుంటారు.

Similar News

News October 21, 2025

భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తిరుపతి, కడప, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.

News October 21, 2025

ఆపరేషన్ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి: మోదీ

image

దీపావళి వేళ దేశ ప్రజలకు PM మోదీ లేఖ రాశారు. ‘అయోధ్యలో రామమందిరం నిర్మించాక ఇది రెండో దీపావళి. ఈసారి చాలా ప్రత్యేకం. శ్రీరాముడు మనకు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, నీతి నేర్పాడు. కొన్ని నెలల క్రితం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ ఇందుకు నిదర్శనం. నక్సలిజాన్ని నిర్మూలించిన ప్రాంతాల్లోనూ దీపాలు వెలిగాయి. ఇటీవల ఎంతోమంది హింసను వదిలి రాజ్యాంగంపై విశ్వాసంతో అభివృద్ధిలో భాగమవుతున్నారు’ అని పేర్కొన్నారు.

News October 21, 2025

డాక్టరేట్‌ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ

image

సైన్స్‌‌లో డాక్టరేట్‌ పొందిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ. పైటోమెడిసిన్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నిపుణురాలైన ఈమె మూర్చ, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ఖైరా ప్రొఫెసర్‌షిప్‌ పొందారు. అక్కడ పలు విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్‌ అకాడమీ ఫెలోషిప్, 1961లో కెమిస్ట్రీలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ అవార్డు పొందారు.