News February 26, 2025

మహిళలకు మోదీ సోషల్ మీడియా అకౌంట్స్!

image

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్. ఆయనకు సోషల్ మీడియాలోనూ కోట్లాది మంది ఫాలోవర్లున్నారు. ఇన్‌స్టాలో 92.3 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 50 మిలియన్లు, Xలో 105.5 మిలియన్ల ఫాలోవర్లు ఆయన సొంతం. అలాంటి అకౌంట్స్ ఒక్కరోజు మీ సొంతమైతే ఏం చేస్తారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కొంతమంది స్ఫూర్తిదాయకమైన మహిళలకు ఈ ఖాతాలు అందించనున్నారు. వారి అనుభవాలను ఇందులో పంచుకుంటారు.

Similar News

News March 19, 2025

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

image

ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
✤ రూ.2 వేల కంటే తక్కువ లావాదేవీలకు (పర్సన్ టు మర్చంట్) యూపీఐ ఛార్జీలు ఉండవు
✤ అస్సాంలో రూ.10,601 కోట్లతో అమ్మోనియా, యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు
✤ మహారాష్ట్రలో రూ.4,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే
✤ గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు.

News March 19, 2025

ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ కొత్త రూల్స్

image

ఏప్రిల్ 1 నుంచి TDS(మూలం వద్ద పన్నుకోత) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్ల FD, RDపై వార్షిక ఆదాయం రూ.లక్ష వరకు ఉంటే TDS వర్తించదు. ప్రస్తుతం రూ.50వేల వరకే ఉంది. అలాగే సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ.50వేలు మించకుండా ఉంటే దానిపై బ్యాంకులు TDS కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్‌ బ్రోకర్లకు వార్షిక కమిషన్‌ ఆదాయం రూ.15,000 మించితే TDS వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు.

News March 19, 2025

మోహన్‌బాబుకు ‘కన్నప్ప’ టీమ్ విషెస్

image

మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న ఆయన ఫొటోను కుమారుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల మూవీ నుంచి విడుదలైన టీజర్‌, పాటకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

error: Content is protected !!