News August 8, 2024

ఎల్లుండి వయనాడ్‌కు మోదీ?

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న వయనాడ్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో కన్నూర్ వెళ్లనున్న ఆయన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారని సమాచారం. అనంతరం ఈ ఘటనతో నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో ఆవాసం పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. కాగా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Similar News

News November 28, 2025

చెక్క దువ్వెన వాడుతున్నారా?

image

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్‌ లిక్విడ్‌/ షాంపూ, కొబ్బరి, ఆలివ్‌ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.

News November 28, 2025

మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

image

TG: మహబూబాబాద్(D) మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. ఎంత పుణ్యమో తెలుసా?

image

వైష్ణవాలయాల్లో ఏడాదంతా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకను సూచిస్తూ వీటిని తెరుస్తారు. ఇందులో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావిస్తారు. అలాగే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇందుకు సంబంధించి టికెట్లను TTD నిన్న విడుదల చేసింది. ☞ వాటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.