News August 8, 2024
ఎల్లుండి వయనాడ్‌కు మోదీ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న వయనాడ్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో కన్నూర్ వెళ్లనున్న ఆయన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారని సమాచారం. అనంతరం ఈ ఘటనతో నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో ఆవాసం పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. కాగా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News September 7, 2024
భారీగా తగ్గిన ఐఫోన్ ధర
సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News September 7, 2024
ఆ మాటలతో అతని మెంటాలిటీ బయటపడింది: బజరంగ్ పునియా
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ వైఫల్యంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ <<14037088>>వ్యాఖ్యలతో<<>> అతని మెంటాలిటీ బయటపడిందని బజరంగ్ పునియా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఓటమితో అతను సంతోషంగా ఉండొచ్చని విమర్శించారు. అది వినేశ్ మెడల్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజలదని పేర్కొన్నారు. ఇలా ఓటమిని సెలబ్రేట్ చేసుకునేవారిని దేశ భక్తులంటారా? అని ప్రశ్నించారు.
News September 7, 2024
చవితి శుభాకాంక్షలు తెలిపిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. స్వతహాగా భారతీయుడు కాకపోయినా ఇక్కడి రీల్స్, సినీతారల స్టెప్స్ వేస్తూ వార్నర్ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆయన ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.