News August 15, 2024

వచ్చే నెలలో న్యూయార్క్‌కు మోదీ?

image

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో న్యూయార్క్‌లో జరిగే యూఎన్ ‘సమ్మిట్ ఆఫ్ ది ప్యూచర్’లో ఆయన పాల్గొంటారని సమాచారం. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నేతలు హాజరవుతారు. అలాగే మోదీతో క్వాడ్ నేతలు కూడా అక్కడే సమావేశం కానున్నట్లు సమాచారం. ఎన్నారైలు నిర్వహించే ఓ కార్యక్రమంలో కూడా పీఎం పాల్గొంటారని తెలుస్తోంది.

Similar News

News October 28, 2025

నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

image

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.

News October 27, 2025

కవిత కొత్తగా..

image

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.

News October 27, 2025

రావి చెట్టును ఎందుకు పూజించాలి?

image

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో అగ్నిని పుట్టించే ‘అరణి మధనం’లో రావి కర్రలను ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైంది కూడా ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో దైవంతో పాటు కచ్చితంగా ఈ రావి వృక్షాలకు కూడా పూజలు నిర్వహిస్తారు.