News August 15, 2024
వచ్చే నెలలో న్యూయార్క్‌కు మోదీ?
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో న్యూయార్క్‌లో జరిగే యూఎన్ ‘సమ్మిట్ ఆఫ్ ది ప్యూచర్’లో ఆయన పాల్గొంటారని సమాచారం. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నేతలు హాజరవుతారు. అలాగే మోదీతో క్వాడ్ నేతలు కూడా అక్కడే సమావేశం కానున్నట్లు సమాచారం. ఎన్నారైలు నిర్వహించే ఓ కార్యక్రమంలో కూడా పీఎం పాల్గొంటారని తెలుస్తోంది.
Similar News
News September 17, 2024
బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు స్టే
దేశవ్యాప్తంగా ప్రైవేట్ కట్టడాలపై అనధికారిక బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు, రోడ్లు, ఫుట్ పాత్‌లు, నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది. ఎన్నికల కమిషన్‌కు కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దని పేర్కొంది.
News September 17, 2024
ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖకు ఆమె బ్యాక్ బోన్
ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కుదరడం వెనుక CM ఎలెక్ట్ ఆతిశీది కీలకపాత్ర. గతంలో విద్యాశాఖ మంత్రికి సలహాదారుగా, ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా ఉన్న ఆమె పాఠశాలల్లో మెరుగైన వసతులు, విద్యార్థుల సమ్మిళిత వికాసానికి డిజిటల్ తరగతులు, క్రీడలు, ఆంత్రప్రెన్యూరియల్ కరిక్యులమ్ ప్రవేశపెట్టారు. ఈ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తుండడం వెనుక ఆతిశీ కృషి ఎంతో ఉంది.
News September 17, 2024
గణేశ్ నిమజ్జనం.. తెలంగాణ పోలీసుల సూచన
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ‘గణేశ్ నిమజ్జనంలో ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సాహాలతో పాల్గొనాలి. ఎక్కడా గొడవలకు తావివ్వకూడదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. ఎవరైనా మీకు అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనిపిస్తే వెంటనే డయల్ 100కి లేదా దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.