News August 28, 2024
వచ్చే నెలలో రాష్ట్రానికి మోదీ?
AP: వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ‘క్రిస్ సిటీ’ పనులకు ప్రధాని భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. లేదంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 20న వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పర్యటనకు వీలు కాకపోతే వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా దాదాపు 11 వేల ఎకరాల్లో ‘క్రిస్ సిటీ’ ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News September 11, 2024
బిడ్డ ఫొటో షేర్ చేసిన ప్రణీత
నటి ప్రణీత ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బేబీ ఫొటోను ఆమె తాజాగా ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మా బేబీ వచ్చింది. లెట్ ది అడ్వెంచర్ బిగిన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోలో ఆమె భర్త నితిన్ రాజు కూడా ఉన్నారు. కొవిడ్ సమయంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, 2022లో తమ తొలి సంతానం ఆర్ణకు జన్మనించారు. బావ, అత్తారింటికి దారేది తదితర తెలుగు సినిమాల్లో ప్రణీత నటించారు.
News September 10, 2024
తోడేళ్ల దాడులకు ఆ వైరసే కారణం?
UP బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. వాటికి రేబిస్ లేదా కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడమే ఇలాంటి అసాధారణ పరిస్థితికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అవి మనుషులపై భయాన్ని కోల్పోతాయని, విచ్చలవిడిగా కరుస్తాయని పేర్కొంటున్నారు. జంతు నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారానే కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ చీఫ్ SP యాదవ్ తెలిపారు.
News September 10, 2024
హనీ ట్రాప్ జరిగింది.. నాపై కేసు కొట్టేయండి: ఎమ్మెల్యే పిటిషన్
AP: తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు <<14034033>>కొట్టేయాలని<<>> సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై, ఆగస్టులో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా మహిళ ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. దీన్ని హనీట్రాప్‌గా పేర్కొన్నారు. తనను బెదిరించి అత్యాచారం చేశారని టీడీపీకి చెందిన ఓ మహిళ <<14026695>>వీడియోలు<<>> రిలీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.