News August 10, 2024

ఇవాళ వయనాడ్‌కు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కన్నూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలకు వెళ్లి వారిని కలవనున్నారు. పునరావాస పనుల పరిశీలనతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు.

Similar News

News September 21, 2024

తిరుమల లడ్డూ వివాదం.. కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్

image

తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతున్న వేళ వేలాది ALT అకౌంట్లలో ఒకే తరహా ట్వీట్లు రావడంపై కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2-3 ఏళ్లుగా శ్రీవారి లడ్డూ రుచి చూడగానే మా అమ్మ అనారోగ్యం పాలయ్యేది. దాన్ని ఎక్కువగా తినొద్దని మాకు చెప్పేది. అందులో ఏదో తప్పుగా జరుగుతోందని ఇప్పుడు అర్థమైంది’ అంటూ ట్వీట్లు వచ్చాయి. దీంతో అందరికీ ఒకే అమ్మ ఉందా అనే అర్థంలో ‘వన్ నేషన్.. వన్ మామ్’ అని INC రాసుకొచ్చింది.

News September 21, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్కకుక్కకఱచి బాధ చేయు
బలిమి లేని వేళబంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బలం తగ్గిపోయి చిక్కిపోయినప్పుడు సింహాన్ని కూడా కుక్క కరవగలదు. అందువల్ల మనకు బలం లేనప్పుడు పంతానికి పోవడం మంచిది కాదు.

News September 21, 2024

హెజ్‌బొల్లా టాప్ కమాండర్ హతం

image

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మిలిటెంట్ల మధ్య భీకర వార్‌తో మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన అటాక్‌లో హెబ్‌బొల్లా ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ హతమయ్యాడు. 1983లో లెబనాన్ రాజధాని బీరుట్‌లోని US రాయబార కార్యాలయంపై బాంబు దాడిలో ఇతనిదే కీలక పాత్ర. అదే ఏడాది US మెరైన్ బ్యారక్స్‌పై అటాక్ చేశాడు. ఇతని ఆచూకీ చెబితే 70 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని గత ఏడాది అమెరికా ప్రకటించింది.