News June 4, 2024

మోదీ Vs దీదీ.. గెలుపెవరిది?

image

2024 ఎన్నికల్లో భాజపా ఎక్కువగా ఫోకస్ చేసిన ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ 2014లో 34, 2019లో 22 సీట్లు గెలుచుకుంది. 2014లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2019లో ఆ సంఖ్యను 18కి పెంచుకుంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు వెలువడే ఫలితాలు బెంగాల్‌లో కీలకంగా మారనున్నాయి.

Similar News

News November 14, 2024

గ్రూప్-4 రిజల్ట్స్ ఇవ్వాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్

image

TG: గ్రూప్-4లో అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు విడుదల చేయొద్దని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా మరికొందరు వెంటనే రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇస్తే ఫలితాలు ఆలస్యం అవుతాయని, అది కోరేవారు కొంతమందే ఉన్నారని చెబుతున్నారు. రెండేళ్లుగా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఫలితాలు ఇవ్వాల్సిందేనని TGPSCని కోరుతున్నారు.

News November 14, 2024

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి: సజ్జనార్

image

ఆర్టీసీ బస్సులో పాట పాడి వైరలయిన <<14578057>>దివ్యాంగ సింగర్‌<<>>ను TGSRTC ఎండీ సజ్జనార్ కలిసి అభినందించారు. ‘దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని గాయకుడు రాజు నిరూపిస్తున్నారు. మధురమైన గాత్రమే కాదు.. పాట‌కు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాల్లేకుండా త‌న చేతులు, కాళ్ల‌తో సంగీతాన్ని అందిస్తోన్న ఈయన ప్రతిభ అద్భుతం. ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.

News November 14, 2024

7 ఓవర్ల మ్యాచ్‌.. పాక్ బోల్తా

image

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య తొలి T20ని వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన AUS 93 రన్స్ చేసింది. మ్యాక్స్‌వెల్ 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 19 బంతుల్లోనే 43 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. 94 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన PAK జట్టులో ఫర్హాన్(8), రిజ్వాన్(0), బాబర్(3), ఉస్మాన్(4), సల్మాన్(4), ఇర్ఫాన్(0) అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో PAK 64 రన్స్‌కే పరిమితమైంది.