News October 22, 2024
రేపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల భేటీ ఖరారైంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా బుధవారం ఈ భేటీ జరగనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. తూర్పు లద్దాక్‌లో పెట్రోలింగ్‌పై భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం భేటీ జరగనుండడం గమనార్హం.
Similar News
News November 12, 2024
థాంక్స్ శివయ్య.. భక్తి చాటిన వానరం
TG: ఓ వానరం శివలింగం వద్ద చేసిన సందడి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కార్తీకమాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శివలింగం వద్ద భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన ప్రసాదాలు, అరటిపండ్లను వానరాలు ఆరగించాయి. వాటిల్లో ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఆహారం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పినట్లు ఆ దృశ్యం ఉందని అక్కడున్న వారు చర్చించుకున్నారు.
News November 12, 2024
తెలంగాణ ఆగమైతోంది: KTR
TG: పస లేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో రైతన్నలు రోడ్డెక్కారు. హైడ్రాపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల కోసం విద్యార్థిలోకం భగ్గుమంది. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర్రజేశారు. కులగణన ప్రశ్నలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది’ అని ట్వీట్ చేశారు.
News November 12, 2024
కేసులు కాదు వీటిపై దృష్టి పెట్టండి: అంబటి రాంబాబు
AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏడాది బాలుడిని <<14585855>>కుక్కలు<<>> చంపడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ‘వాడి మీద కేసు పెడదాం. వీళ్లను బొక్కలో వేద్దాం. మొత్తాన్ని చితక్కొడదాం అని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి. ఈ వార్త చూస్తేనే హృదయం ద్రవిస్తోంది’ అని ట్వీట్ చేశారు.