News July 26, 2024

ఒలింపిక్ క్రీడాకారులకు మోదీ శుభాకాంక్షలు

image

ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. దేశం గర్వించేలా పతకాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 117 మంది క్రీడాకారులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 19, 2025

మెదక్: ‘పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలి’

image

టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనడం ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్నదన్నారు.

News November 19, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 19, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.