News April 28, 2024
మోదీ ఏపీ టూర్ వాయిదా

AP: ప్రధాని మోదీ ఏపీ పర్యటన వాయిదా పడింది. రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ఆయన ఎన్నికల ప్రచారానికి రావాల్సి ఉండగా దాన్ని అదే నెల 7, 8 తేదీలకు మార్చినట్లు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. మూడో దశ ఎన్నికల ప్రచారంలో పీఎం తలమునకలై ఉండటమే ఇందుక్కారణమని పేర్కొంది. అనకాపల్లి, రాజమండ్రి, పీలేరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రధాని ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉంది.
Similar News
News April 19, 2026
ప.గో: హాట్ టాపిక్.. అసలు సూత్రధారులు ఎవరు?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారుచేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యవహారం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇప్పటికే ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
News April 19, 2026
AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్‌లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
News April 19, 2026
పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

AP Dy.CM పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.


