News January 23, 2025

మోదీ దూతకు సహజంగానే ఎక్కువ మర్యాద దొరుకుతుంది: జైశంకర్

image

తొలి హయాంలో మోదీ సర్కారుతో మొదలైన సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డొనాల్డ్ ట్రంప్ బృందం ఆత్రుత ప్రదర్శిస్తోందని EAM జైశంకర్ అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో తొలి వరుసలో కూర్చోవడంపై స్పందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దూతకు సహజంగానే ఎక్కువ మర్యాద లభిస్తుంది’ అని ప్రెస్‌మీట్లో చెప్పారు. మోదీ పంపిన లేఖను ట్రంప్‌ చేతికిచ్చానని తెలిపారు. బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇదే ఉదాహరణ అన్నారు.

Similar News

News February 7, 2025

8 నెలల్లో రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు: TDP

image

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. 34 ప్రాజెక్టుల ద్వారా రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసింది. త్వరలో ఏర్పాటు కానున్న కంపెనీల్లో 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పూర్తి వివరాలను వెల్లడించింది.

News February 7, 2025

‘వందే భారత్‌’లో ఫుడ్ ఆప్షన్‌పై కీలక నిర్ణయం

image

‘వందే భారత్‌’ రైళ్లలో ‘పుడ్ ఆప్షన్’ డెలివరీపై రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుక్ చేసే సమయంలో పుడ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు ఆహారం కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే, ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్న సమయంలోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫుడ్ విషయంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రైల్వే బోర్డ్ IRCTCలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.

News February 7, 2025

ట్రైన్‌లో ప్రసవం.. పండంటి ఆడబిడ్డ జననం!

image

బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఓ గర్భిణి సహర్సాకు వెళ్తుండగా రైలులోనే పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కోచ్‌లోని ఇతర మహిళలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రసవానికి సహాయం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపేసి ఆమెను ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!