News May 25, 2024

కేజ్రీవాల్ ఇంటర్వ్యూపై మోదీ పరోక్ష విమర్శలు

image

అవినీతి పరులను మీడియా ఇంటర్వ్యూ చేయడం చూసి షాక్ అయ్యానని అన్నారు ప్రధాని మోదీ. ఒకప్పుడు ఛార్లెస్ శోభ్‌రాజ్ వంటి క్రిమినల్స్‌ని అలా ఇంటర్వ్యూ చేయడం చూశానన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపైనే మోదీ పరోక్ష విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. సమాజంలో జవాబుదారీతనం తగ్గుతోందని, నేరస్థులకు ఆదరణ దక్కుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Similar News

News December 5, 2025

ఇండిగో.. ఒక్కరోజే 550 విమానాల రద్దు

image

నిన్న 550 విమానాలను రద్దు చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో DGCAకు నివేదిక ఇచ్చింది. ఫేజ్-2 ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(FDTL) ప్రకారం సిబ్బంది లేక సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పింది. నిబంధనల అమలులో పొరపాట్లు, ప్లానింగ్‌ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. ఇండిగో రోజుకు దాదాపు 2,300 ఫ్లైట్లను నడుపుతోంది.

News December 5, 2025

CEOలనూ AI వదలదు: రచయిత స్టువర్ట్

image

ఫ్యూచర్‌లో CEO ఉద్యోగాలనూ AI లాగేసుకునే ఛాన్స్ ఉందని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ మోడ్రన్ అప్రోచ్’ పుస్తక సహ రచయిత స్టువర్ట్ రస్సెల్ అభిప్రాయపడ్డారు. AIకి నిర్ణయాధికారం ఇవ్వాలని లేదంటే తప్పుకోవాలని బోర్డు సభ్యులు CEOను డిమాండ్ చేసే అవకాశం ఉండొచ్చన్నారు. పని అనుకునే ప్రతి దాన్నీ AI చేసేస్తోందన్నారు. ఇప్పటికే కార్మికులు, డ్రైవర్లు, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు నష్టపోతున్నామనే చర్చ జరుగుతోంది.

News December 5, 2025

డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

image

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం