News May 25, 2024
కేజ్రీవాల్ ఇంటర్వ్యూపై మోదీ పరోక్ష విమర్శలు

అవినీతి పరులను మీడియా ఇంటర్వ్యూ చేయడం చూసి షాక్ అయ్యానని అన్నారు ప్రధాని మోదీ. ఒకప్పుడు ఛార్లెస్ శోభ్‌రాజ్ వంటి క్రిమినల్స్‌ని అలా ఇంటర్వ్యూ చేయడం చూశానన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపైనే మోదీ పరోక్ష విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. సమాజంలో జవాబుదారీతనం తగ్గుతోందని, నేరస్థులకు ఆదరణ దక్కుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
Similar News
News February 16, 2025
CT-2025.. భారత్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టికెట్లు

భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ICC గుడ్ న్యూస్ చెప్పింది. CTలో భాగంగా దుబాయ్‌లో IND ఆడే గ్రూప్, తొలి సెమీస్ మ్యాచ్‌లకు అదనపు టికెట్లను ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. హైబ్రిడ్ విధానంలో CT జరుగుతున్నందున ఫైనల్ మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేయలేదు. భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ దుబాయ్‌లో, లేకపోతే లాహోర్‌లో జరుగుతుంది. గ్రూప్ స్టేజీలో IND 20న బంగ్లాతో, 23న పాక్‌తో, మార్చి 2న NZతో తలపడనుంది.
News February 16, 2025
ఏపీ ఇష్టారాజ్యం-కాంగ్రెస్ చోద్యం: KTR

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.
News February 16, 2025
ఓటములే గుణపాఠాలు: విక్రాంత్

విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని యాక్టర్ విక్రాంత్ మాస్సే అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ లో నటి భూమి పెడ్నేకర్‌తో కలిసి పరీక్షల అనుభవాల్ని స్టూడెంట్స్‌తో పంచుకున్నారు. ఓటములనేవి జీవితంలో భాగమని వాటినుంచే మనం అధికంగా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకంటూ స్వంత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు.