News May 1, 2024

ఈనెల 8,10న రాష్ట్రంలో మోదీ సభలు

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 8న వేములవాడ, వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. 10న మహబూబ్‌నగర్, HYDలోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభల్లో మోదీ ప్రసంగిస్తారు. అందుకు రాష్ట్ర బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

Similar News

News March 3, 2026

టాటా మెమోరియల్ సెంటర్‌లో 40 పోస్టులు

image

<>ముంబైలోని <<>>టాటా మెమోరియల్ సెంటర్ 40 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, BE/BTech, ME/MTech, MD/DNB/DM, BSc(MIT), MSc(AI, డేటా సైన్స్), డిప్లొమా, GNM అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/PET, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in

News March 3, 2026

తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టెలీ మానస్’ సేవలను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్షల భయం, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటే ‘14416’ అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఈ సేవలు 20కి పైగా భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలి. SHARE IT

News March 3, 2026

క్రియేటర్లకు మద్దతుగా విజయసాయి ట్వీట్

image

సోషల్ మీడియా సంస్థలు క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయని మాజీ MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో 55% ఇస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ రూపాయి కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మన క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాలని, లేదంటే మన దేశానికే ‘భారత్ టాక్సీ’ తరహా సొంత ప్లాట్‌ఫామ్ ఉండాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. గతంలో క్రియేటర్లకు <<19248675>>మద్దతుగా<<>> అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.