News August 23, 2024

మోదీ వార‌సుడు అమిత్ షా.. కొత్త స‌ర్వే

image

ప్ర‌ధాని మోదీ త‌రువాత ఆ బాధ్య‌త‌లను చేపట్టడానికి BJPలో అమిత్ షా సమర్థులని సర్వేలో తేలింది. 25% మంది మద్దతుతో ఆయన ముందున్నట్టు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే-2024 వెల్ల‌డించింది. అమిత్ షా త‌రువాత 19% మంది మ‌ద్ద‌తుతో యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో, 13%తో 3వ స్థానంలో గ‌డ్క‌రీ, 5% మద్దతుతో రాజ్‌నాథ్, శివరాజ్ సింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గతంతో పోలిస్తే అమిత్ షాకు 3-4% మద్దతు తగ్గింది.

Similar News

News September 19, 2024

అక్టోబర్ 22న ప్రభాస్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ రీ రిలీజ్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దశరథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు నిర్మించారు. 2011లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.

News September 19, 2024

కంగనపై దానం వ్యాఖ్యలు సరికాదు: KTR

image

TG: బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దిగజారి మాట్లాడటం సరికాదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆమెను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. గతంలో సోనియా గురించి అసోం సీఎం అభ్యంతరకరంగా మాట్లాడితే కేసీఆర్ ఖండించారని కేటీఆర్ గుర్తు చేశారు. మహిళల పట్ల అగౌరవ వ్యాఖ్యలను పార్టీలు సమర్థించకూడదన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని ఆయన కోరారు.

News September 19, 2024

కొత్త రేషన్ కార్డులపై గుడ్‌న్యూస్

image

TG: అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరలను CM ఆదేశించారు.