News April 11, 2025
రాణాపై మోదీ ట్వీట్.. 14ఏళ్ల తర్వాత వైరల్

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాపై ప్రస్తుత ప్రధాని మోదీ 2011, జూన్ 10న చేసిన ట్వీట్ తాజాగా వైరలవుతోంది. ‘ముంబై దాడిలో తహవూర్ రాణా నిర్దోషి అని అమెరికా ప్రకటించి భారత సార్వభౌమత్వాన్ని అవమానించింది. ఇది విదేశాంగ విధానానికి తిరోగమనం’ అని ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు 14ఏళ్ల తర్వాత రాణాను అమెరికా నుంచి రప్పించిన విషయం తెలిసిందే.
Similar News
News April 25, 2025
యూట్యూబ్ నుంచి ‘అబిర్ గులాల్’ సాంగ్స్ తొలగింపు

భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమా విడుదలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని పాటలను యూట్యూబ్ నుంచి మేకర్స్ తొలగించారు. ‘సరిగమ’ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీటిని రిలీజ్ చేయగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రిమూవ్ చేసింది. కాగా ఈ మూవీలో భారతీయ నటి వాణీకపూర్ ఫవాద్‌కు జోడీగా నటించారు.
News April 25, 2025
IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచులు(16 పాయింట్లు) గెలవాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం ఆయా జట్లు కింది సంఖ్యలో మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
* గుజరాత్ టైటాన్స్(GT)- 2, DC- 2, RCB-2,
* PBKS-3, LSG-3, MI-3
* KKR-5, SRH-6, CSK-6
* RR-అవకాశాలు లేనట్లే.
News April 25, 2025
హిందువులైతే ఇలా చేయరు.. ఉగ్రదాడిపై భాగవత్

పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.