News December 1, 2024

నాని సినిమాలో విలన్‌గా మోహన్ బాబు?

image

నాని హీరోగా నటించనున్న ‘ప్యారడైజ్’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నాని తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ లేదా శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తారని టాక్. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తారు.

Similar News

News March 23, 2026

ఏప్రిల్ 3న ఓటీటీలోకి ‘సితారే జమీన్ పర్’

image

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఎట్టకేలకు OTTలోకి రానుంది. ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది జూన్ 20న ఈ మూవీ రిలీజ్ కాగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 1 నుంచి యూట్యూబ్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు. రూ.100 చెల్లించి చూసే అవకాశం కల్పించారు. ఇప్పుడు OTTలోకి వస్తోంది.

News March 23, 2026

మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

image

AP: వచ్చే మూడేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నాం. ఇప్పటికే రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. విశాఖ, అమరావతి, తిరుపతిని 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. భోగాపురం విమానాశ్రయం దాదాపు పూర్తయింది. జులైలో ప్రారంభిస్తాం. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుంది’ అని పేర్కొన్నారు.

News March 23, 2026

OFFICIAL: సామ్ కరన్ స్థానంలో శనక

image

IPL-2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనక(రూ.2కోట్లు)ను ఎంపిక చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఆయన శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 3350కి పైగా రన్స్, 86 వికెట్లు సాధించారు.