News December 1, 2024
నాని సినిమాలో విలన్‌గా మోహన్ బాబు?
నాని హీరోగా నటించనున్న ‘ప్యారడైజ్’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నాని తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ లేదా శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తారని టాక్. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తారు.
Similar News
News December 14, 2024
అల్లు అర్జున్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫోన్ కాల్
తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. అరెస్ట్ ఘటనపై వివరాలను వారు ఆరా తీశారు. మరోవైపు ముంబైలో వార్-2 షూటింగ్‌లో బిజీగా ఉండటంతో వచ్చాక కలుస్తానని ఎన్టీఆర్ తెలిపినట్లు సమాచారం. అంతకుముందు బాలకృష్ణ కూడా అల్లు అర్జున్‌కు కాల్ చేశారు.
News December 14, 2024
అల్లు అర్జున్‌ను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఆయన్ను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నిన్న అల్లు అరవింద్‌కు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.
News December 14, 2024
ప్రాణాలు పోస్తున్న గుండెలు ఆగిపోతున్నాయి!
వైద్యులు గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లోని సీనియర్ డాక్టర్ ఆదిన్ అమీన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం ఆందోళనకరం. ఈక్రమంలో దీనికి గల కారణాలను వైద్యులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సుదీర్ఘ పని గంటలు, పనిలో తీవ్రమైన ఒత్తిడి, వైద్యుల అనారోగ్య జీవనశైలి, సరైన నిద్రలేకపోవడం, నివారణకు రెగ్యులర్ చెకప్స్ లేకపోవడం’ అని చెప్తున్నారు.