News December 19, 2024

మోహన్ బాబుకు చుక్కెదురు

image

TG: మోహన్ బాబు ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Similar News

News January 21, 2025

ట్రంప్ గారూ.. మరోసారి ఆలోచించండి: WHO

image

WHO నుంచి <<15210852>>తప్పుకుంటున్నట్లు<<>> ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు 39 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంటే తాము 500 మి.డా. చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకుముందు చెప్పారు.

News January 21, 2025

IT దాడులపై స్పందించిన దిల్ రాజు భార్య

image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. ‘సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చాం. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

News January 21, 2025

డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు: జనసేన

image

AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.