News December 11, 2024

మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం

image

TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 16, 2025

నేడు ఈడీ విచారణకు కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 7నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరడంతో నేడు రావాలని నోటిసులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

News January 16, 2025

ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్

image

ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.

News January 16, 2025

తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి

image

AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.