News December 11, 2024

మోహన్‌ బాబును అరెస్ట్ చేయాలి: బీజేపీ ఎంపీ

image

TG: మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు పొందిన వ్యక్తి నిన్న వ్యవహరించిన తీరు దారుణమని మండిపడ్డారు. మరోవైపు జర్నలిస్టుపై మోహన్ బాబు దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తప్పుబట్టారు. జర్నలిస్టు సమాజానికి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.

Similar News

News July 6, 2025

‘అమెరికా పార్టీ’ స్థాపిస్తున్న ఎలాన్ మస్క్

image

‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ పాసైతే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో పార్టీపై ట్విట్టర్‌లో రెండోసారి పోల్ పెట్టగా.. 12.48 లక్షల ఓట్లొచ్చాయి. 65.4% మంది మూడో పార్టీకి ఓటేశారు. ఈ నేపథ్యంలోనే “రెండు పార్టీలు ఒక్కటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీ కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ ‘అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంది’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

News July 6, 2025

ప్రపంచంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న YouTube ఛానళ్లు ఇవే..

image

1.MrBeast (అమెరికా)- 411 మిలియన్లు
2.T-Series (ఇండియా)- 298 మి.
3.Cocomelon – Nursery Rhymes (అమెరికా)- 195 మి.
4.SET India (భారత్)- 185.1 మి.
5.Vlad and Niki (అమెరికా)- 142 మి.
6.Kids Diana Show (అమెరికా)- 135 మి.
7.Like Nastya (అమెరికా)- 128 మిలియన్లు
8.Stokes Twins (అమెరికా)- 128 మి.
9.Zee Music Company (భారత్)- 114 మి.
10.PewDiePie (జపాన్/స్వీడన్)- 111 మి.

News July 6, 2025

ఫార్మాసూటికల్స్‌‌లో అపార అవకాశాలు: మోదీ

image

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో అద్భుతమైన సమావేశం జరిగినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘అర్జెంటీనాతో 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు, అందులోనూ 5 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. రానున్నకాలం ఇరు దేశాల మధ్య మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయం, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ఫార్మాస్యూటికల్స్, క్రీడల వంటి రంగాల్లోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయి’ అని తెలిపారు.