News November 22, 2024
‘కన్నప్ప’ నుంచి మోహన్ బాబు లుక్ రివీల్

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో మోహన్ బాబు నటిస్తోన్న ‘మహాదేవ శాస్త్రి’ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని విష్ణు ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Similar News
News November 8, 2025
యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.
News November 8, 2025
న్యూస్ అప్డేట్స్ 10@AM

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు
News November 8, 2025
PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్(<


